తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రహదారి 353 రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి బస్సాపూర్ స్టేజి శ్రీ పదరావ్ విగ్రహం వద్ద తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కాలేశ్వరం పర్యటించగా పోలీసులు బస్సాపూర్ శ్రీ పదరావు విగ్రహం వద్ద అక్రమంగా అరెస్టు చేశారు. ఒక డీఎస్పీ ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలతో 100 మంది సిబ్బందితో అరెస్టు చేయడం జరిగినది.పోలీస్ తీరును నిరసిస్తూ జాతీయ రహదారి 353 రోడ్డుపై బైఠాయించి నిరసన ధర్నా చేశారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ… మోటార్లు మునిగినవి నీట మునిగి పోయినవి అని కాలేశ్వరం కన్నెపల్లి అవి చూడడానికి వెళ్ళితే కూడా ఫోన్ ఇవ్వడం లేదు ప్రాజెక్టులు తెలంగాణ ప్రజల కోసం కట్టిండ్రా లేదా అవినీతి కొరకు కట్టిండ్రా అయితే నాయకులను పోనీయరు. విద్యావంతులను పోనియ్యరు. సమాధానం చెప్పవలసిన బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నది. అని అయినా ఖండించారు. అవినీతి పనులు ఇంకా ఏమన్నా జరుగుతున్నాయా ?అక్కడ ఏమి జరుగుతుంది?.తెలుసుకునే పరిస్థితి కూడా లేకుండా పోతుంది అని ఆయన అన్నారు.లారీలు బస్సులు రెండు వైపులా అరగంట సేపు ఒక కిలోమీటర్ దూరం స్తంభించినాయి.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అయితే ప్రకాశ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి విలాసరావు.యూత్ కాంగ్రెస్ కాటారం మండలం అధ్యక్షులు సందీప్.మేడిపల్లి పార్టీ అధ్యక్షులు దేవేందర్ యాదవ్ గడ్డం క్రాంతి అలాగే కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.