తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం

యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో యాదాద్రి-భువనగిరి జిల్లా స్థాయి సమావేశం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షురాలు బండిరాల సుశీల,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల బాల్ రాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, సౌత్ జోన్ కన్వీనర్ గొలనుకొండ బాస్కర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడచిన రజకులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎలాంటి పురోగతి చెందలేదు కావున అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే. అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు కోరారు.
సౌత్ జోన్ కన్వీనర్ గొలనుకొండ బాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా చోట్ల ధోభీఘాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఉన్నచోట మరమ్మతులు చేయక నిరూపయోగంగా ఉండటం బాధాకరం తక్షణమే ప్రభుత్వం గాని సంబందిత అధికారులు స్పందించాలని అన్నారు.
జిల్లా అధ్యక్షురాలు బి.సుశీల మాట్లాడుతూ భార్యభర్తలు ఇద్దరు కులవృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించే సమయంలో భార్య గర్భిణీ దాల్చిన సమయంలో ఐలమ్మ ఆసర కింద 12 నెలలు ప్రతినెలా 5000 రూపాయలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశానికి బీబీ నగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోరుకంటి వేణు, చింతల రామకృష్ణ,పట్టణ నాయకులు చీరాల లింగయ్య,బాను ప్రకాష్,మునిరాజ్ ,బీమరాజ్ ,ప్రభాకర్, యాదగిరి, శ్రీకాంత్,శ్రీనివాస్, రజక సీనియర్ నాయకులు, మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు,కళాకారులు ,వృత్తిదారులు వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.