అకాల వర్షం పిడుగు పడి ముగ్గురు మృతి…………..తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది.అకాల వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. చౌటుప్పల్ మండలం లింగోజీగూడెంలో పిడుగుపడి దంపతులు కరు ణాకర్రెడ్డి(60),వీణమ్మ (50) మృతి చెందారు. వీరితో పాటు ఓ పాడిగేదె మరణించింది. బొమ్మల రామారం మండలం మర్యాలలో పిడుగు పడి రాములు మృతి చెందారు.
హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్, కాప్రా, మల్కాజిగిరి, సనత్నగర్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబా ద్, బోయిన్పల్లి, అల్వా ల్ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది. మరో 3 రోజులపాటు ఉరుములు మెరు పులు గాలివాన తో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతా వరణ శాఖ, హైదరాబాద్ వాతా వరణ శాఖ అధికారులు తెలిపారు.