|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

తెలంగాణ రాష్ట్రం లో పండిన వరి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మె కొనుగోలు చెయాలి:వడ్లు కొనే దాకా కేంద్రం పై యుద్ధమే

దేశం అంతా ఒకే విధంగా కొనుగోలు ఏర్పాటు చేయాలి

దేశ వ్యాప్తంగా బీజేపీ పతనానికి తెలంగాణ నుంచే శ్రీకారం

తల్లాడ : తెలంగాణ రాష్ట్రం లో పండిన ప్రతి వరి ధాన్యపు గింజను కేంద్ర ప్రభుత్వం కొనే దాకా నిరవధిక పోరాటం చేయాలని,బీజేపీ తెలంగాణ లో వడ్లు కొనకుండా తెలంగాణ ప్రభుత్వం పై బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు కు నిరసనగా ఈరోజు తల్లాడ లో టి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డం.వీరమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MLC తాత మధు గారు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తాత మధుమాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం లో వరిధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం బీజేపీ ,తెలంగాణ లో పండించిన వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న0దుకు దేశ వ్యాప్తంగా రైతు నిరసన దీక్ష లు చేపట్టి కేంద్రం పై పోరాటం చేసి వడ్లు కొనే వరకు పోరాటం చేయాలని,ముఖ్యమంత్రి కేసీఆర్,టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కె.టి.ఆర్,మరియు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల రైతులు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈగ నైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై కక్ష సాధింపులు మానుకొని రైతులు పండించిన వడ్లు కొనాలని లేకపోతే వడ్లు కొనే వరకు పోరాటం ఆగదు అని మాట్లాడినరు.ఇతర దేశాలలో మాదిరిగా పంజాబ్,గుజరాత్,హర్యానా,లలో వడ్లు కొన్నట్లు గా తెలంగాణ లో పండించిన ధాన్యాన్ని కూడా ఎందుకు కొనటం లేదు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు,రైతు బీమా,సబీసీడీ పై ఎరువులు ఇచ్చి రైతులను అదుకుంటుటే ,ఇక్కడ పండించిన పంటను కొనే దమ్ము లేని దద్దమ్మ ప్రభుత్వం బిజిపి ప్రభుత్వం అని దుయ్యబట్టారు

ఈ కార్యక్రమంలో

ఎంపీపీ దొడ్డ.శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిసాల. ప్రమీల,వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి.భద్రరాజు,వైరావ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ నాయుడు.శ్రీనివాసరావు, సర్పంచుల మండల అధ్యక్షుడు శీలం.కోట రెడ్డి,బీసీ సెల్ మండల అధ్యక్షుడు శెట్టిపల్లి.లక్ష్మన్ రావు,టి.ఆర్.ఎస్ జోన్ అధ్యక్షుడులు దిరిసాల. దాసురావు, కేతినేని. చలపతిరావు, దగ్గుల. శ్రీనివాస రెడ్డి,బద్దం.కోటిరెడ్డి,నిలాద్రి ఆలయ డైరెక్టర్ పెరిక.నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ గుండ్ల.వెంకటి,టి.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు జి.వి.ఆర్,టి.ఆర్.ఎస్ పట్టణ నాయకులు సంగసాని.శ్రీను,తేళ్ళూరి. రాగు,టి.ఆర్.ఎస్ నాయకులు నున్నా. తిరుమలరావు,దొడ్డ.చిన్న శ్రీను,మరేళ్ల.దేవేందర్,మజి జడ్పీటీసీ ముకర ప్రసాద్,నూతనకల్ గ్రామ యూత్ అధ్యక్షుడు పమ్మి.కృష్ణ రావు,రైతులు వేమిరెడ్డి. నాగిరెడ్డి, కిషోర్ రెడ్డి,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.