తెలంగాణ రైతు సంఘం(AIKS) జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నాడు జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం(AIKS) జనగామ జిల్లా సహాయ కార్యదర్శి గా భూక్య చందు నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిమూడ్ శోభన్ తెలిపారు.ఈసందర్భంగా భూక్య చందు నాయక్ మాట్లాడుతూ….. జనగామ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యలు రైతులకు బ్యాంక్ రుణాలు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, నకిలీ విత్తనాలు,ఫెర్టిలిజర్స్ కొరత,రైతులుపండించిన పంటలకు గిట్టుబాటుకల్పించాలని, పాడి రైతులకు ఇన్సెటివ్ ఇవ్వాలని, పౌల్ట్రీ రైతులకు కార్పొరేట్ కంపెనీల మోసాలపై, విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించాలని,ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని, నాపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు