#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

నిన్న జనగాం జిల్లా కేంద్రంలో పాడిరైతుల సమావేశం బతకమ్మా కుంటలో జరిగింది. ఈ సమావేశంలో దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కాసారపు ధర్మరెడ్డిని పాడిరైతులు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
అనంతరం ధర్మరెడ్డి గారు మాట్లాడుతూ విజయడైరిలో కొన్ని సంవత్సరాలుగా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘo అధ్యక్షులుగా కొనసాగుతున్న విజయడైరికి పాలు పట్టి పొస్తున్న వందల మంది పాడిరైతులు విజయడైరిని నమ్ముకొని పలుపొస్తున్నారు. పాడిరైతుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నది ఐనప్పటికి ఈరోజువరకు కూడ ప్రభుత్వ విజయడైరినే నమ్ముకొని పాలుపొస్తున్న పాడిరైతులకు ప్రభుత్వం సబ్సిడీలు మాత్రం పూర్తి స్థాయిలో అందరికి అందడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని అన్నారు.
ఈ విజయ పరిరక్షణ సమీతి అంటే విజయడైరి యొక్క పాడిరైతుల సమస్యల పరిష్కణ కోసం ఈ సంఘo రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొనుటకు ఆయా జిల్లాలోని పాడిరైతులు సమయతం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విజయడైరిని అభివృద్ధి చేయకుండ ప్రైవేట్ డైరిలను ప్రొచ్చహించడం వారి దగ్గర కమీషన్లకు అసెపడి ప్రైవేట్ డైరిలను రాష్ట్రములోకి అనుమతిలు ఇవ్వడం వారికీ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించి వారిని ప్రొచ్చహించే బదులుగా కొన్ని ఏండ్ల తరబడి విజయడైరిని నమ్ముకొని పాలుపొస్తున్న రైతుల సొమ్మును అధికలాభాలు చూపిస్తూ ఆసొమ్మును ప్రభుత్వం దాన్ని పాలించే పాలకులు బాగుపడుతున్నారు కాని డైరికి పాలు పోస్తున్న పాడిరైతులకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు అన్నారు. రాబోవురోజులలో ఈ విజయపరిరక్షణ సమీతి ఆధ్వర్యంలో పాడిరైతులకు ఎక్కడ సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఉద్యమంచేస్తామని ఇప్పటిక్యన ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ డైరిలను ప్రొచ్చహించిన పాడిరైతులను ఇబ్బందులకు గురిచేసీన రాష్ట్రములోని పాడిరైతులను ఏకంగా చేసి పాల రేట్ ఇప్పుడున్న ఖర్చులకు అనుగుణంగా పెంచే వరకు పరిరక్షణ సమీతి ఆధ్వర్యంలో నేను జనగాంలోని పాడిరైతులను ఎకతాటిపైకి తీసుకరావడం కోసం జిల్లాలోని అన్ని మండలలో పర్యటించి మండల కమీటిలను ఏర్పాటు చేస్తానని అన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.