తెలంగాణ సాధన కోసం సృష్టమైమ కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు

తెలంగాణకు హరితహారం మణిహారం లాంటిదని కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. సోమవారం కోదాడ పట్టణంలోని 14వ వార్డు ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఆకుపచ్చని ఆవరణ కోసం- పసిడి పచ్చని రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.హరితహారంలో నూటికి నూరు శాతం మొక్క‌లు నాటలి,నాటిన నూటికి నూరు శాతం మొక్క‌ల‌ను మ‌నుగ‌డ సాగించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి అని ఆయన అధికారులకు ప్రజా ప్రతినిధులకు సూచించారు.భావితరాలకు స్వచ్ఛమైన,కాలుష్యరహిత హరిత తెలంగాణ సాధన కోసం సృష్టమైమ కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వేళుతుంది అని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మొక్కలను నాటి పచ్చదనం కనిపించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో హరితహారం ఒకటని చెప్పారు.రాష్ట్రంలో ప్రస్తుతమున్న 24 శాతం అటవీ విస్తీరణంలోని పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు హరితహారం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు.రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా అన్ని రకాలుగా అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా మలుచుకోవడమే తెలంగాణకు హరితహారం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. భూతాపాన్ని నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావారణాన్ని అందించటమే లక్ష్యంగా హరితహారం కొనసాగుతోందని అన్నారు.గత ఐదేళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతున్న హరితహారం ఇప్పుడు 8వదశకు చేరుకుందని చెప్పారు.మహాయజ్ఞంలా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్,స్థానిక కౌన్సిలర్ చందర్రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్, శేషు, ఈదుల కృష్ణయ్య, పట్టణ కౌన్సిలర్లు కల్లూరి పద్మజా, మేదర్ లలిత, సుశీల రాజు,గుండెల సూర్యనారాయణ, ఖదీర్ పాషా, పెండెం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ బ్రహ్మం, చింతల నాగేశ్వరరావు,యేసయ్య, బత్తుల ఉపేందర్, అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.