#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం గారు సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.
మహిళ కమాండర్ గా పని చేశారు. వారి మరణం తెలంగాణ సిపిఎం ఐ పార్టీకి తీరని లోటని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాంపురం సిపిఎం ఐ , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బి.వి.రాఘవులు, రాంపురం సిపిఎం ఐ మాజీ సర్పంచ్ రాంపల్లి. అబ్బయ్య గౌడ్, మరిపెడ మండల సిపిఎం కార్యదర్శి అల్వాల వీరన్న, తదితరుల పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.