తల్లాడ మండలం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ దిమ్మె వద్ద 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తల్లాడ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు,నాయకులకు మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో తల్లాడ మండల తెలుగు యువత అధ్యక్షులు శీలం రామనరసింహ రెడ్డి రైతు సంఘము అధ్యక్షులు వడ్డేల్లి నాగేశ్వరరావు జిల్లా రైతు సమన్వయ కమిటీ మెంబర్ రావూరి రవిప్రసాద్,కొమ్మినేని సత్యనారాయణ శ్రీనివాస రాజు ,దుగ్గినేని వెంకటయ్య కృష్ణార్జునరావు ప్రసాద్ సురేష్ కృష్ణ ,రాము తదితరులు పాల్గొన్నారు.