తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర ఆరుద్ర

తెలుగు సాహిత్య చరిత్రలో తన దైన చెరగని
కొత్త ముద్ర వేసుకున్న అసలు సిసలు ప్రజాకవి ఆరుద్ర అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్
శ్రీమతి వాసిరెడ్డి పద్మ కీర్తించారు. తెలుగు సాహిత్యం నిలిచి ఉన్నంత వరకూ, గోదావరి ప్రవహించే వరకూ ఆరుద్ర పేరు
నిలిచే ఉంటుందని
ఆమె అన్నారు. సిపి బ్రౌన్ మందిరలో బుధవారం ఉదయం వాసిరెడ్డి పద్మ ‘ఆరుద్ర సాహిత్య స్మరణ’ చేశారు. బ్రౌన్ మందిరం నిర్వాహకుడు శ్రీ సన్నిధానం శాస్త్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ, తెలుగు కవిత్వాన్ని, రచ నలను‌ ప్రజలలోకి తీసుకువెళ్ళడంలో ఆరుద్ర పూర్తిగా ధన్యత చెందారని అన్నారు.
తన సినిమా పాటలతో సినీ రంగాన్ని కళారంగం స్ధాయికి తీసుకువెళ్ళిన కవి ఆరుద్రగా ఆమె
పేర్కొన్నారు. పాటలతో భావోద్వేగాలను కనబరచిన కవిగా ఆరుద్ర నిలుస్తారని వాసిరెడ్డి పద్మ ఆయనను ఘనంగా కీర్తించారు. తెలుగు సాహిత్య పరిశోధనకు ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం ఓ సాక్ష్యంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలుగు సాహిత్యాన్ని అణువణువూ స్పృశించిన మహోన్నత సాహిత్యకారుడు ఆరుద్ర అని వాసిరెడ్డి పద్మ వర్ణించారు.

సన్నిధానం కుటుంబంతో
ఆరుద్రకు అనుబంధం

సన్నిధానం నరసింహ శర్మ కుటుంబంతో ఆరుద్రకు ఎంతో అనుబంధం‌ ఉండేదని ఈ సందర్భంలో వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆరుద్ర వ్రాసిన లేఖలతో సన్నిధానం శర్మ ‘ ఆరుద్ర లేఖలు ‘ ప్రచురించారని ఆమె ఈ సందర్భంలో తెలిపారు.
ప్రముఖ చిత్రకారుడు కందిపల్లి రాజు గీసిన ఆరుద్ర తైలవర్ణ చిత్రాన్ని వాసిరెడ్డి పద్మ ఆవిష్కరించారు. ప్రముఖ మానసిక విశ్లేషకురాలు చిన్మయి తమ్మారెడ్డి సంపాదకత్వంలో వెలువడే ‘ చిన్మయం’ పత్రికను వాసిరెడ్డి పద్మ విడుదల చేశారు.‌ కవి జోరా శర్మ మాట్లాడుతూ, ఆరుద్ర హాస్య ప్రయోక్తమైన ప్రాస కవితలు‌ వి నిపించారు. బ్రౌన్ మందిరం తరపున శ్రీమతి సన్నిధానం భార్గవి వాసిరెడ్డి పద్మను సత్కరించారు. శ్రీ వెస్లీని సన్నిధానం శాస్త్రి సత్కరించారు.
హెల్పింగ్ హ్యాండ్ ద్వారా అనుప్ జైన్ చేస్తున్న సేవలకు స్పందించిన వాసిరెడ్డి పద్మ బ్రౌన్ మందిరం తరపున అనుప్ జైన్ ను సన్మానించారు. ‌
అనుప్ జైన్ వాసిరెడ్డి పద్మకి‌ జ్ఞాపిక బహుకరించారు. సభకు ముందు ప్రముఖ గాయకుడు మల్లాది శ్రీరామ్ ఆరుద్ర వ్రాసిన వేదంలా ఘోషించే గోదావరి కీర్తన పాడారు.‌ మరో గాయకుడు అండూరి సుభాష్ ఆరుద్ర వ్రాసిన పాటలు వినిపించారు.
కార్యక్రమంలో
‘చిన్మయం ‘ ప్రతినిధి రమ, మాజీ‌ కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, పిల్లి నిర్మల, హెల్పింగ్ హ్యాం
డ్ వ్యవస్ధాపకుడు అనుప్ జైన్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నందం స్వామి, హరిత దళం‌ ప్రతినిధులు వై. చిట్టిబాబు, దుర్గాదేవి జయంతి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.