శ్రీ సాయి విజ్ఞాన భారతి హై స్కూల్ కాశిబుగ్గ నందు తొలి ఏకాదశి మరియు బక్రీద్ పండుగల సంబరాలు తెలుగువారి మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి మరియు ముస్లింల పండుగ అయినటువంటి బక్రీద్ పండుగల సంబరాలు నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు పండగల పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు తమ పాఠశాలలో హిందువుల మొట్టమొదటి పండుగ అయిన తొలి ఏకాదశి మరియు ముస్లింల పండుగ అయినటువంటి బక్రీద్ పండుగల ప్రాముక్యాన్ని విద్యార్థులకు వివరించి విద్యార్థుల్లో కుల మత ప్రాతిపదికన భేదం లేకుండా అందరూ సోదర భావంతో మెలగాలని ఒకరికొకరు అన్నదమ్ముల ఆప్యాయంగా కలిసిమెలిసి ఉండాలని మరియు విద్యార్థులకు ప్రతి పండుగ పట్ల అవగాహన ఏర్పడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల చైర్మన్ వేముల నవీన్ డైరెక్టర్ ముస్కు రోజా శ్రీకాంత్ రెడ్డిలు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మిఠాయిలు తినిపించి ఒక వేడుకలు జరుపుకున్నామని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.