ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ మండలాల పూర్తి స్థాయి,గ్రామ స్థాయి కమిటీలను ఈ నెల 25 వరకు పూర్తి చేయాలి
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ *ఆధ్వర్యములో కార్యకర్తలకు శిక్షణ తరగతులు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ పూర్తి కమిటీలను అదే విధంగా అనుబంధ సంఘాల పూర్తి కమిటీలను ఈ నెల 25 వరకు ఏర్పాటు చేయాలని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు కమిటీల నియామకం అనంతరం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి ఆధ్వర్యములో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నాల్లాని సత్యనారాయణ రావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు పోరిక బద్రు నాయక్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుక్కల నాగరాజు,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు అలోత్ దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి ఏళ్లవుల అశోక్,ఎంపీటీసీ మవురపూ తిరుపతి రెడ్డి
ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి చిర్ర రాజేందర్
యూత్ కాంగ్రెస్ నాయకులు మేడం రమణ కర్, మండల ప్రధాన కార్యదర్శి తారక్,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంగొత్ వంశీ కృష్ణ
అజ్మీరా శ్రీధర్, మొరే రాజు,తదితరులు పాల్గొన్నారు
