దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాలి-ఎస్.ఎఫ్.ఐ

విద్యాసంస్థల ప్రారంభిస్తుండడంతో హస్టల్లో అడ్మిషన్లు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాలి: ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర డైరెక్టర్ కరుణాకర్ కు వినతిపత్రం అందజేత తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 01 నుండి విద్యాసంస్థలను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్న నేఫద్యంలో ఈ విద్యా సంవత్సరం నూతనంగా కళాశాలలో ప్రవేశం పోందిన ఇంటర్, డిగ్రీ, పి.జీ. ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో మొదటి సంవత్సరం చదవడానికి చేరిన విద్యార్థులకు హస్టల్స్ అడ్మిషన్ ఇవ్వడం లేదు. వెంటనే అడ్మిషన్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కరుణాకర్ గారికి ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని పేరుతో కేవలం గత సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మాత్రమే హస్టల్స్ ఉండాలని ప్రభుత్వం నిబంధనలు ఇవ్వడంతో పేద విద్యార్థులకు చదువులు దూరం అయ్యే అవకాశం ఉంది.ఏజెన్సీ ప్రాంతం నుండి టౌన్ ప్రాంతంలో చదువుకోవడానికి చేరిన విద్యార్ధీనిలు, విద్యార్థులు ఎక్కడ ఉండి చదువుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. ప్రశ్నించింది. ప్రభుత్వం కేవలం 9,10 తరగతులు మాత్రమే పాఠశాలలకు అనుమతులు ఇవ్వడంతో చాలా ప్రీ మెట్రిక్ హస్టల్స్ ఖాళీగా ఉండే అవకాశం ఉందని వాటిని ప్రభుత్వం మిగతా తరగతులు ప్రారంభించే వరకు హస్టల్స్ కోసం వాడాలని కోరారు. పేద విద్యార్ధులు ఆన్ లైన్ లో తరగతులు వినలేని పరిస్థితి లేదని ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్ర డైరెక్టర్ కరుణాకర్ స్పందింస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని తెలిపారు. జిల్లాల్లో హస్టల్స్ ప్రారంభించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ వినతిపత్రం అందజేసిన వారిలో ఎస్.ఎఫ్.ఐ. రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి వినతిపత్రం అందజేశారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.