kvps_news_photos

జిల్లాలో ఉన్న దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కెవిపిఎస్ మరిపెడ మండల మహాసభ స్థానిక భార్గవి ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 22 వేల దళిత జనాభా ఉండగా 35, 726 దళిత కుటుంబాలు ఉంటే కేవలం 250 మందికి మాత్రమేదళిత బంధు వచ్చిందని మిగిలిన వారికి కూడా వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల ఎస్సీ కాలనీలు ఉండగా 17 లక్షల జనాభా కలిగి దళిత కాలని లో నేటికీ ఎలాంటి మౌలిక వసతులకు నోచుకోకపోగా అనేక ప్రాంతాలలో నేటికీ తారు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకుండా అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చన్న, జిల్లా నాయకులు పులిపాక నాగరాజ్, మరిపెడ మండల జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు గోపి రమేష్ , ఎస్ఎఫ్ఎస్ఐ నాయకులు పెద్దబోయిన వీరబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాంబాబు, చర్మకారుల సంఘం మండల అధ్యక్షులు బాష్పంగు బిక్షం, లు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.