#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

దళితబందు పథకాన్ని విమర్శించడమంటే దళితులను అవమానపరచడమే

దళితులుగా పుట్టడం మా పాపమా? లేక దళితులకు తెరాస ప్రభుత్వం అండగా నిలవడం శాపమా ?

పత్రికల్లో వస్తున్న కథనాలలో ఎలాంటి వాస్తవం లేదు

ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయ లబ్ది కోసం అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి దళితులకు అన్యాయం చేయొద్దు

దళితులంటే ఎందుకింత అక్కసు?

పూటగడవక అవస్థలు పడుతున్న మేము 2 లక్షలు ఇస్తామని ఎలా అనుకుంటున్నారు.

మీ రాజకీయ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తును అంధకారం చేయొద్దు – దళితబందు లబ్ధిదారులు.

దళితబందు గురించి తప్పుడు ప్రచురణలు చేస్తే పరువునష్టం దావా వేసి ధర్నా చేస్తాం. దళితుల ఆగ్రహావేశాలకు గురి కాక తప్పదు

కోదాడ మండల పరిదిలోని గుడిబండ గ్రామానికి చెందిన దళితబందు లబ్ధిదారులు దళితబందు అమలుపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళితబందు లబ్ధిదారులు మాట్లాడుతూ దళితులంటే ఎందుకింత పక్షపాతం? దళితులుగా పుట్టడం మేం చేసుకున్న పాపమా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్ధిక స్వావలంబన, ఆర్థికాభివృద్ధి కోసం దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల పక్షపాతిగా దలితుల కోసం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు, అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి దళితుల జీవితాలను అంధకారం చేయొద్దని తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని దళితబందు విషయంలో మమ్మల్ని ఎవరూ డబ్బులు అడగలేదని,పత్రికల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసి దళిత కుటుంబాలకు అన్యాయం చేయొద్దని వేడుకుంటూ ఇంకోసారి మా ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేసి దళితులకు అన్యాయం చేస్తే మా దళితుల ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమపంగు అంబేద్కర్, పోయిలపంగు బిక్షం, పచ్చిగోళ్ల రాంబాబు, చుక్కా బ్రహ్మం,పులి గోపయ్య,వంశీ, లబ్ధిదారులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.