దళితుల అభ్యున్నతికి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే రెడ్యానాయక్

దళితుల యొక్కఅభ్యున్నతికి రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి ఆర్థిక అభివృద్ధికి దేశమే మెచ్చే విధంగా దళిత బంధు లాంటి మహత్తర పతకం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మరిపెడలో దళితబంధు యూనిట్ కు ఎంపికైన చాగంటి శీను వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో లేని మరెన్నో సంక్షేమ పథకాలు అమలు పరిచింది టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు, ఒడిసిఎమ్మెస్ మాజీ ఛైర్మెన్ కుడితి మహేందర్ రెడ్డి, జడ్పీటీసీ తేజవత్ శారదా రవీందర్, చిన్నగూడూరు జడ్పీటీసీ సునీత మురళీధర్ రెడ్డి, ఎంపీపీ పద్మ వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి కో ఆర్డినటర్ సంకినేని మంగపతి రావు, జిల్లా రైతు సమితి సభ్యులు కాలు నాయక్, చిన్నగూడూర్ పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, విస్సంపల్లి ఎంపీటీసీ హుస్సేన్, తానంచెర్ల టిఆర్ ఎస్ నాయకులు ముఖేష్ పార్టీ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.