దళితుల సమస్యల పరిష్కారం చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి- సిపిఎం జిల్లా కార్యదర్శి

పాలకుర్తి మండలంలోని manchupula గ్రామంలోని దళితులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనుకరెడ్డి అన్నారు. శనివారం స్థానిక పాలకుర్తి మండల కేంద్రంలోని manchupulaగ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాడ దళితులు చేస్తున్న దీక్ష 81 రోజు దీక్షలు ప్రారంభించరు
ఈ సందర్భంగా కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వం 1993లో ఇల్లు లేని నిరుపేదలు దళితులకు పిల్లల కోసం ఇస్తే ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పలుసార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు మెమోరండం ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు. దళితులు ఆందోళన చేస్తుంటే స్థానిక మంత్రి గారైన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దళితుల పక్షాన ఉంటాడా భూకబ్జాదారులకు అండగా ఉంటాడా అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాది దళిత ప్రభుత్వం చెప్పుకుంటున్న తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదని వారు అన్నారు. ఒకవైపు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా మంటూనే మరోవైపు దళితుల భూమి కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇప్పటికైనా స్థానిక మంత్రిగారు అధికారులు స్పందించి దళితుల భూమి దళితుల కేటాయించలనిలేనియెడల ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య. సింగారపు రమేష్. బొట్ల శేఖర్. జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దడిగె సందీప్. manchupulaభూ పోరాట సాధన కమిటీ నాయకులు కాకర్ల రమేష్. బాణాల వెంకన్న. యాదగిరి. రేణుక. లక్ష్మీ. యాకమ్మ. వెంకటమ్మ. ఎల్లమ్మ. కాకర్ల సోమయ్య. సోమన్న. ప్రశాంత్. బాబు. విజయ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.