దళిత జర్నలిస్టుల లకు అన్నం గోస

*శిక్షణ పేరుతో జర్నలిస్టుల కు గోర అవమానం
*కడుపు మాని బోజనం చేయని జర్నలిస్టులు
*టీడబ్ల్యూజేఫ్ మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ .బండివిజయ్ కుమార్ .

బంగారు తెలంగాణ అహర్నిశలు కలం తో పోరాడిన కలం వీరులకు అన్నం కూడా పెట్టని అల్లం నారాయణ అని టీడబ్ల్యూజేఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండివిజయ్ కుమార్ ఆరోపించారు. శనివారం దళిత జర్నలిస్టుల కు శిక్షణ తరగతులు లో భాగంగా మద్యాహ్నం హాజరయిన జర్నలిస్టుల కు రాజధాని నడి బొడ్డు పై ఆకలి కేకలు తో దళిత జర్నలిస్టులు అల్లడినా పరిస్థితి ఏర్పడింది. అల్లం అన్నం పెట్టలేదని చాలామంది బయటికి వెళ్లి భోజనం చేయడం బాధాకరమని ఆరోపించారు. ఉపాన్యాసాలు ఫుల్ అన్నం నిల్ అని ఎండల్లో జర్నలిస్టుల ఆవేదనను ఎవరూ అర్థం చేసుకుంటారు అంటూనే నిర్వాహకుల పై కొందరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆకలి చనిపోయిన తరువాత ఏమీ తిండి తింటామని సీనియర్లు కొంతమంది ఆరోపించారు. ముందుగా అధికారులకు ప్లాన్ లేకకోవడమే ఇబ్బందులు ఎదుర్కొన్నారని బండి విజయ్ కుమార్ అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.