నల్లగొండ జిల్లా AO మోతిలాల్ గారికి ఫిర్యాదు
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన గోల్కొండ రాధ అనే దళిత మహిళ భూమిని (20 గుంటలు భుామి ) అక్రమంగా లాక్కొన్న చిట్యాల స్థంభారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం పాలడుగు నాగార్జున లు డిమాండ్ చేశారు. పురాతన కాలంగా తమ వారసత్వ భూమి అని నేటికీ అట్టీ భూమి రాధా కబ్జా కలిగి ఉన్నదని అన్నారు. మర్రిగూడ మండలం తహశీల్దార్ గా వున్న దేశ్యానాయక్ పలు అక్రమాలకు పాల్పడినాడనీ సదర మహిళ ధరఖాస్తు చేసినప్పటికి అట్టి భూమిని అక్రమంగా పట్టా మార్పిడి చేశారని అన్నారు. అక్రమంగా దొంగ సాదాబైనామ పైనా చేసినా దేశ్యా నాయక్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న దళిత మహిళ ఆరోగ్యం క్షీణిస్తుందనీ వెంటనే సమస్యను పరిష్కరించి దీక్షను విరమింప చేయాలని జిల్లా కలెక్టరు గారిని కోరినట్లు తెలిపారు .