నిర్మాణ రంగం వేగవంతం అవుతున్న తరుణంలో ఇంటి నిర్మాణపు భాద్యతలు మరియూ నాణ్యతా ప్రమాణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గత రెండు రోజులుగా షాద్నగర్ పట్టణం లో దాల్మియా సిమెంట్ వారి తరుపున సాంకేతిక మార్గదర్శకత్వం అమలు చేయడం జరిగింది . రెండు రోజులుగా 4 టెక్నికల్ మొబైల్ వాన్ లతో మొత్తం 10 మంది టెక్నికల్ సర్వీసెస్ ఇంజనీర్ లు ప్రతి నిర్మాణ సైట్ ని సందర్శించి ప్రతి కస్టమర్ కి టెక్నికల్ సర్వీసెస్ అందించడం తో పాటు మేస్త్రీ సమ్మేళన కార్యక్రమం లో కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగిందని దాల్మియా సిమెంట్ షాద్నగర్ టెక్నికల్ ఇంజనీర్ శివ శంకర్ గంగ తెలిపారు. ఈ కార్యక్రమం లో దాల్మియా సిమెంట్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సేల్స్ హెడ్ డి.వి చంద్ర శేఖర్ గారు, స్టేట్ టెక్నికల్ హెడ్ భువన కుమార్ గారు, సేల్స్ మేనేజర్ రాజు గారు, సేల్స్ ఆఫీసర్లు మధు, శ్రీనివాస్, టెక్నికల్ ఇంజనీర్ శివ శంకర్ గంగ, వరుణ్ ట్రేడర్స్ డీలర్స్ శివ గారు, శశి గారు, ఎస్వీఎం ట్రేడర్స్ డీలర్ నవీన్ గారు, ప్రజలు, మేస్త్రీలు పాల్గొన్నారు.