పీడిత ప్రజల గొంతుక దాశరథి
తెలంగాణ ప్రజల కన్నీళ్లనే అగ్నిధారగా మలిచి తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించి పీడిత ప్రజల గొంతుగా మారి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి. మహాకవి దాశరధి కృష్ణమాచార్య అని టిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కరే దారసింగ్ అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలోని దాశరధి సెంటర్లో మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలను గ్రామములో సాహితి అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వివిధ సంఘాల ఆధ్వర్యాలలో శుక్రవారం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా దారాసింగ్ మాట్లాడుతూ నిజాం ప్రభువు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన దాశరథి సేవలను కొనియాడారు. సామాజిక సమస్యలపై దాశరథి సాగించిన పోరాటం నిరుపమానం అని సింగ్ పేర్కొన్నారు. అభ్యుదయ భావాలతో అనేక రచనలు చేసి ప్రజలను చైతన్యం చేశారని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని జైలు గోడల మీద రాసి రాక్షస రాజ్యాన్ని కూల్చాలని తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన ధీరుడు దాశరథి అని చాటారు, నూతనంగా ఏర్పాటు ఐనా తెలంగాణ రాష్ట్రం లో ఆయన జయంతి, వర్ధంతి వేడకులు చేపట్టి సత్కారాలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ధారాసింగ్, మూల మురళిధర్ రెడ్డి, చెన్నయ్య, చెన్నారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు మీర్జా మోసిన్ బేగ్, సర్పంచ్ కొమ్ము మల్లయ్య, ఎస్.ఎం.సి. చైర్మన్ నరేందర్, మైనారిటీ సెల్ నాయకులు అబ్బాస్, నాయకులు శ్రీరాములు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దేశగాని కృష్ణ,విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.