దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించిన జీఎస్సార్

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలం అందుకుతండా – వెంచరామి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెన(కల్వర్టు), రోడ్డు దెబ్బతింది. దీంతో, విషయం తెలుసుకున్న భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి తో కలిసి దెబ్బతిన్న కల్వర్టు ను, రోడ్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలతో అందుకుతండా నుండి వెంచరామి, కుర్మపల్లి గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దెబ్బతిన్న కల్వర్టును, రోడ్డును అధికారులు పరిశీలించి యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి, రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో కల్వర్టు లు, రోడ్లు చాలా వరకు దెబ్బ తిన్నాయని వాటన్నింటినీ గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. అదేవిధంగా, భారీ వర్షాలతో దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న, వరి ఇతర వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.20వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం బావుసింగ్ పల్లి గ్రామంలోని ఎస్ సి కాలనీలో వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అక్కడి ప్రజలతో, మహిళలతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కచ్చు మల్లేష్, స్వామి, మురళి, శ్రీను, కుమార్, శివ, దేవేందర్, చంద్రయ్య, నంద రాజు నాయక్, తిరుపతి రావు, నారాయణ, తిరుపతి, సమ్మయ్య, ఐలయ్య లతో పాటు రైతులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.