#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

దేవాలయ పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న… కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు.
బుధవారం అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ప్రమా మాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు విచ్చేసి,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ….నూతనంగా ఎన్నికైన దేవాలయ పాలకమండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పాలకవర్గం ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. గొండ్రియాల శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రచురిత కలిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింత అమర్చుకోవాలని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలకమండలి దేవాదాయ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. అర్చకులకు జీతాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. ఈ ప్రాంత ప్రజలపై ఆ భగవంతుని కరుణ ఎల్లవేళల ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ భగవంతున్ని కోరుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ చైర్మన్ గంగూరు శ్రీనివాస్ రావు, పాలక మండలి సభ్యులు, కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి , జెడ్పిటిసి ఉమా శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లీలావతి బాబురావు, మండల ప్రధాన కార్యదర్శి మాగి యాకోబు , దేవాదాయ శాఖ అధికారులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.