దేశవ్యాప్తంగా యువత చే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యువత చే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని జాతీయ ఎన్నికల కమిషన్ ను కోరిన ఫోరం ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు డా. సామల శశిధర్ రెడ్డి నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటరుగా నమోదు చేయించాలని జాతీయ ఎలక్షన్ కమిషనర్ వారిని కోరుతున్నట్లు ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి తెలియజేశారు. అలాగే భారతదేశంలోని ప్రతి పౌరుడు ఓటు హక్కును తమ వజ్రాయుధంగా భావించాలని అందుకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకులు తమ బాధ్యతగా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మన దేశాన్ని ఒక గొప్ప రాజ నీతి గల పరిపాలన అధ్యక్షుడి చేతిలో పెట్టే బాధ్యత మన చేతుల్లో ఉంటుంది కనుక అది కేవలం ఓటు ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి యువత ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం పై దృష్టి సారించాలి అందుకు తగిన విధంగా ఎన్నికల అధికారులు స్పందించి సహాయ సహకారాలు అందించాలని శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఓటరు నమోదు విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీగా పక్కా ప్రణాళికతో బోగస్ ఓట్లు లేకుండా అలాంటి ఓట్లను తొలగించి స్పష్టమైన ఓటరు జాబితాను తయారు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు సూచించారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే చనిపోయిన మరుసటి రోజే ఆ వ్యక్తి పేరును ఓటరు జాబితా నుండి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ద్వారా స్పష్టమైన ఓటర్ల జాబితా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.