దేశవ్యాప్త బంద్ పాలకుర్తిలో విజయ వంతం

దేశవ్యాప్తంగా రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త బంద్ పాలకుర్తిలో విజయ వంతమైంది. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్, ఎంసిపిఐ (యు), టిడిపి, ద్రావిడ బహుజన సమితి, జేఏసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో బంధు నిర్వహించారు. బ్యాంకులు, పెట్రోల్ బంకులు, కిరాణా షాపులు, హోటళ్ళు, ఇతర వ్యాపారా షాపులను బంద్ చేయించారు. హనుమకొండ రోడ్డు, జనగామ రోడ్డు, తొర్రూర్ రోడ్డు, మొండ్రాయి రోడ్డు మార్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినదించారు. రాజీవ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోమ సత్యం, సిపిఎం మండల కార్యదర్శి చిట్యాల సోమన్న, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి గుగులోతు నాను నాయక్, బత్తిని కుమారస్వామి, గూగులొతు అరుణ్నాయక్, సిపిఐ(ఎంఎల్) మండల కార్యదర్శి జీడి సోమయ్య, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనంత రజిత, టిడిపి మండల అధ్యక్షుడు ల్యాబ్ వెంకన్న, గణపురం ఎల్లయ్య, పీ ఉపేందర్,మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, మానస భాస్కర్, మలప రాజు నరేష్, పెనుగొండ రమేష్, ద్రావిడ బహుజన సమితి జిల్లా అధ్యక్షులు నల్లా రమేష్, నియోజకవర్గ కార్యదర్శి బోట్టు శ్రీధర్, ఆయా పార్టీల నాయకులు బైరు భార్గవ్, ఐలేష్, రమేష్, కమ్మగాని మహేష్, తూర్పాటి సారయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.