దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నా ఈ నెల 28 29 తేదీల్లో దేశవ్యాప్తంగా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో H.P.C.L టర్మినల్ ఆయిల్ ట్యాంకర్లు & డ్రైవర్స్ వర్కర్స్ AITUC అనుబంధం కార్మికుల తో కలసి సమ్మెవాల్ పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పాలనలో ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. దేశ స్వతంత్రం పూర్వము నుండి సాధించుకున్న కార్మిక చట్టాలను నలభై రెండు రకాల చట్టాలను నాలుగు కోడలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు జయప్రదం చేయాలని ఆయన కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న అనేక మంది బ్యాంకు ఎగవేతదారుల ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్రమోడీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడని పెట్టుబడి వర్గాలకు ఊడిగం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఉన్నదని కార్మిక ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ దేశ పరిపాలన గాలి కి వదిలేసి కార్మికుల పైన ఒత్తిడితో వెట్టిచాకిరీ చేయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక హక్కుల కోసం కార్మిక చట్టాలను కాపాడుకోవడం కోసం ఈ నెల 28 29 తేదీల్లో జరిగినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, సీనియర్ AITUC నాయకులు చామల అశోక్, యూనియన్ అధ్యక్షులు సట్టు జానయ్య కార్యదర్శి ఉపేందర్ నాయకులు నిమ్మల ప్రభాకర్, శంభయ్యా, అంజయ్య, యాదగిరి, రవి, సోమ్మయ్య, వెంకట్ రెడ్డి, యాదగిరి, సైదులు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.