దేశ అత్యున్నత పదవి చేపట్టిన సాదాసీదా వ్యక్తి కలాం గారు .

కోదాడలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు అభినందనీయం.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు .

ప్రపంచ దేశాల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత దేశానికి గుర్తింపు తెచ్చిన అబ్దుల్ కలాం చిరస్మరణీయులని కోదాడ అభివృద్ధి ప్రదాత, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ లో కిట్స్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ, గౌరవ సలహాదారులు విశ్రాంత ప్రిన్సిపాల్ పోతుగంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…… దేశ రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు. తన జీవితమంతా ఇస్రోకు అంకితం చేసి ప్రపంచ దేశాలకు దీటుగా ఉపగ్రహాలను తయారుచేసి దేశానికి వన్నె తెచ్చారని ఆయన సేవలను స్మరించారు. సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు కలాం ఆశయాలను సాధించాలన్నారు. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని చేపట్టిన కనుమూసే వరకు సామాన్య మానవుని లా జీవితం గడిపిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అన్నారు. ఓ శాస్త్రవేత్త విగ్రహాన్ని కోదాడ లో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన బాధ్యులను ఆయన అభినందించారు. భవిష్యత్ తరాలకు ఈ విగ్రహాలు స్ఫూర్తినిస్తాయి అని ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. నేటి తరం విద్యార్థులు ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలని అన్నారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీనారాయణ ,ఎంపీపి కవితరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు, పైడిమర్రి సత్య బాబు ,పట్టణ కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ, ఖదీర్ పాషా, వెంకటేశ్వర్లు, లలిత,శ్రీనివాస్ యాదవ్, ఒంటి పులి శీను, రాజశేఖర్, నాయకులు ఉపేందర్ గౌడ్, రాయపూడి వెంకట నారాయణ,రోజరమని, నిర్మల,గ్రంధాలయ చైర్మన్ రహీం,బత్తుల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.