దేశ సైనిక వ్యవస్థను ప్రయివేటు పరం చేస్తున్నారా ?

దేశ భద్రత విభాగంలో కాంట్రాక్టు వ్యవస్థ సమంజసం కాదు

అగ్నిపథ్ ను రద్దు చేయాలి

కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేత నాగ సీతారాములు డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
దేశం కోసం పనిచేస్తామని ముందుకు వచ్చిన యువకులను కేంద్రం దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తుందని, దేశ రక్షణను పణంగా పెట్టే అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత నాగ సీతారాములు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక బస్టాండ్ సెంటర్లో పార్టీ పిలుపు మేరకు అగ్నిపద్ పథకాన్ని రద్దు చేయాలని చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ విషయంలో బిజెపి నకిలీ దేశభక్తి బట్టబయలు అయిందన్నారు. దేశ రక్షణను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంచుకుని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్‌, ఇతర సదుపాయాలు లేకుండా చేయడం చూస్తుంటే బిజెపికి దేశ రక్షణ పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకం పట్ల ఇప్పటికే దేశ వ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయినా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత 75 సంవత్సరాలలో ఆయా కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే అనుసరించాలని పేర్కొన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ పై కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నారని దేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉన్న యువకుల జీవితాలను నాశనం చేయొద్దని సూచించారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేద్దామని భావించిన యువకులపై విద్రోహక, దేశద్రోహ ముద్ర వేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ దీనిపై పునరాలోచించాలని సూచించారు. ఆర్మీ శిక్షణ ఇస్తున్న కేంద్రాల్లో రెచ్చగొట్టిన నిర్వాహకులను దీనికి బాధ్యులు చేయాలే తప్ప అభం శుభం తెలియని చిన్నారులను జీవితాలను బలి చేయడం తగదన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత అగ్నిపధ్ ప్రకటించి యువకులను అయోమయంలోకి నెట్టిసీన కేంద్ర వైఖరిపై మండిపడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో ఉద్యోగాల కోసం యువకులు ఎంతో ఎదురు చూసి వారిలోని ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుందని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన రిక్రూట్మెంట్ విధానాలనే తిరిగి చేపట్టాలని తమ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా దీనిపై సత్యాగ్రహం చేపడుతున్నామని చెప్పారు. ఈ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ పార్టీ సుజాతనగర్ మండల అధ్యక్షుడు చింతలపూడి.రాజశేఖర్, , జిల్లా మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఎండి. కరీంపాషా, కిసాన్ సెల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాడిపల్లి.శ్రీనివాసులు, కిసాన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ పైడా. రాజేంద్ర ప్రసాద్, ఓబీసీ సెల్ కన్వీనర్ K.లక్ష్మణ్,, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్. రాము, కొత్తగూడెం టౌన్ నాయకులు జయప్రకాష్,J. మోహన్, ఎస్సీ సెల్ జిల్లా సెక్రెటరీ వట్టి.నరసింహారావు, కిసాన్ సెల్ సెక్రెటరీ కూసబత్తుల. శ్రీనివాస్, బీసీ సెల్ నాయకులు R.మధు, కుంజ.లక్ష్మీనర్సు, నర్సింగ్.బిక్షం, SK.అజ్గార్, రాచబంటీ. నాగరాజు, G.సుధాకర్, బి.కృష్ణ, పి. రమేష్, ఆర్. అచ్చయ్య, E. సురేష్, U. నాగేశ్, K. శివ, L .గోపాల్ రావు, అజ్మీరా మోహన్, ఎనుముల .నాగేశ్వరావు, ఎనుముల. బుచ్చయ్య, ఎనుముల. శ్రీరామ్, ఎనుముల. గోపాల్ రావు,వుప్పనపెళ్లి చిన్న లింగయ్య

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.