/జఫర్ ఘడ్/వెంకటాపూర్
అయినవోలు మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో సదర్ అంజుమన్ అహ్మదియ జాతీయ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదియ మౌల్వీలకు మరియు ఆర్థిక శాఖ సెక్రటరీల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌల్వీ అతావుల్ నుస్రత్ మాట్లాడుతూ ప్రపంచంలో పేదరికం నిర్మూలన కావాలంటే సంపాదించే ప్రతీ వ్యక్తి నూటికి ఆరు రూపాయల పావుల చందా రూపంలో అహ్మదియ జమాత్ స్థాపకులు మిర్జా గులాం అహ్మద్ స్థాపించిన ఆర్థిక శాఖ(బైతుల్ మాల్)లో జమ చేయాలన్నారు.మానవ సేవ మాధవ అని అందరి ప్రేమించాలని ఎవ్వరినీ ద్వేషించరాదని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సర్కిల్ ఇంచార్జ్ ముహమ్మద్ అక్బర్, చందా ఇన్స్పెక్టర్ ముజీబ్, మౌల్వీలు కరీం, అస్గర్,యాకూబ్, రహీం, ఫకీర్, సర్వర్, మస్తాన్, నూరుద్దీన్, సుల్తాన్, అయ్యూబ్,తారీక్, మహమూద్, తదితరులు పాల్గొన్నారు.
