మహబూబాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ వ్యక్తి పేరు ఏసుబ్ అలియాస్ సురేష్. ఇతడు తాళాలు లేకుండా ఉన్న ఇళ్ళలోనే దొంగతనం చేస్తుంటాడు. మహబూబబాద్ జిల్లాలో మూడు చోట్ల దొంగతనానికీ పాల్పడ్డాడు. ఇటీవల గూడూరులోని ఓ ఇంట్లో నాలుగు లక్షల చోరీలో కూడ ప్రధాన నిందితుడు. మధిర, జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇతడు మహబూబాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో సంచరిస్తున్నాడనే సమాచారం వుంది, ఇంకా నేరాలు చేసే అవకాశం వుంది, ఇతడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ పోలికలతో గానీ ఎవరైన అనుమానస్పందంగా కనిపించిన గానీ 100 నంబరు కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారం అందించండి. ఈ దొంగ ఆచూకీ తెలిపిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడును మరియు తగిన పారితోషికం కూడ ఇవ్వబడును. మహబూబాబాద్ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఎస్పి
తెలిపారు
