ధరిత్రి రక్షణ అందరి బాధ్యత

సామాజిక కార్యకర్త మహ్మద్ ఆజమ్
ధరిత్రి రక్షణ అందరి బాధ్యత అని ధరిత్రి రక్షణ కోసం అందరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందని సామాజిక కార్యకర్త , ఇందిరా గాంధీ Nss ఉత్తమ జాతీయ సామాజిక కార్యకర్త గా రాష్ట్రపతి చే అవార్డు గ్రహీత ధర్తీ బచావో సంస్థ వ్యవస్థాపకులు మహ్మద్ ఆజమ్ తెలిపారు.
ధరిత్రి దినోత్సవం
సందర్భంగా నేడు కాకతీయ విశ్వవిద్యాలయం లో నిర్వహించిన ధరిత్రి దినోత్సవ ర్యాలీని అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్త జీవకోటికి జన్మనిచ్చి, పలు పంటలతో సమస్త ప్రాణులను పోషిస్తున్న వేల కోట్ల చదరపు కిలోమీటర్ల ఉపరితల వైశాల్యంతో విస్తరించిన భూమాత ఆరడుగులు మించని మానవ వికృత చేష్టలతో వణికిపోతోందని, పుడమి తల్లి మన అవసరాలను తీర్చగలదు గానీ అత్యాశలను ఎంతమాత్రం తీర్చలేదని ,
ఆనాడు జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అన్నారు.
భూమి స్వరూప స్వభావాలను ఇష్టానుసారం మార్చేస్తూ, కాలుష్యానికి కారణమవుతూ అణువణువునూ గాయాల పాల్జేస్తున్న మనం ఇప్పటికైనా విధ్వంసకర చర్యలను విడనాడి తప్పిదాల నుంచి మేల్కొనకపోతే భవిత అంధకారంగా మారే ప్రమాద పరిస్థితులు పొంచి చూస్తున్నాయన్నాయని , అమృత ఫలాలను, సుజలాలను అందించే నేలతల్లికి మనమంతా క్షమాపణలు చెప్పి దిద్దుబాటు చర్యలకు ఇప్పటికైనా నడుం బిగించాలని , భావితరాలకు ఎటువంటి ఉపద్రవాలు ముంచెత్తకుండా అవని తల్లిని అంతా కాపాడుకోవాలని , వాతావరణాన్ని పరిరక్షించాల్సి బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని, కాలుష్యాన్ని అధిగమించేందుకు మొక్కలను నాటాలని , భూమాతను పవిత్రంగా చూస్తేనే అది మనల్ని అన్నివిధాలా రక్షిస్తుందని, మనం ఉపయోగించిన పాలిథిన్‌ సంచులు, ప్లాస్టిక్‌ పదార్ధాలు భూమిలో ఉండిపోయి విషతుల్యాలుగా మారి నీటిని భూమిలోకి ఇంకనీయకుండా చేసి భూగర్భం విచ్ఛిత్తికి గురవుతోందని అన్నారు.
ఈ సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయ సామాజిక శాస్త్ర పరిశోధన విద్యార్థి తుమ్మిడిశెట్టి సాంబశివరాజు , మాట్లాడుతు భూగర్భ జలాలను ఇష్టానుసారం వాడేస్తుండటంతో అవికాస్తా నిర్వీర్యంగా మారుతున్నాయని, ఇంకుడుగుంతలతో వర్షం నీటిని భూమిలోకి నింపేలా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా చెట్లను సంరక్షిస్తే భూమి చల్లగా, పవిత్రంగా ఉంటుందని, కంప్యూటర్లు, పలు రకాల బ్యాటరీ వ్యర్థాలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు మట్టిని విషపూరితం చేస్తున్నాయని, వీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి సోరుపాక అనిల్.. మాట్లాడుతు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం, సామాజిక కార్యకర్తలు పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించాలని, అందరూ కలిసికట్టుగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో దావెల్ల రాకేష్, నరేష్, గంగారపు మల్లేశం ,మధు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.