ధర్మసాగర్ మండలం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి

ధర్మసాగర్ మండలం రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీమతి శ్రీ సింగపురం ఇందిర గారు

  ఈ రోజు (15-03-2022) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మసాగర్ మండలం చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ PHASE I PHASE II ధర్మసాగర్ పంప్ హౌస్ దగ్గర రైతులకు దేవాదుల ధర్మసాగర్ రిజర్వాయర్ లోని నీళ్లను మండలంలోని గ్రామాలకు నీరు అందకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల తెరాసా నాయకులు వారి సొంత నియోజకర్గంలోని రిజర్వాయర్లకు తరిలించడం బాధాకరం

   శ్రీమతి శ్రీ సింగపురం ఇందిర గారు మాట్లాడుతూ ధర్మసాగర్ మండలం లోని గ్రామాల రైతులకు నీరు అందకుండా ఇతర నియోజకవర్గాలకు తరలించడం బాధాకరమని అన్నారు, రైతులకు పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

రైతులకు రిజర్వాయర్ లోని నీరు అందకుండా తరలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ సోమేశ్వర్ రెడ్డి గారు, జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి గారు, పిసిసి సభ్యులు అమృత రావ్ గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి గారు, ఎంపీపీ మేకల వరలక్ష్మి గారు, మహిళ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు మేరీ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రాజ్ కుమార్ గారు, రంజిత్ గారు, పెద్ద పెండ్యాల గ్రామ శాఖ అధ్యక్షులు బిక్షపతి, నారాయణగిరి గ్రామ శాఖ అధ్యక్షులు కుమార స్వామి, నరేష్, అనిల్, ఇంద్రసేన తదితరుల పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.