ధ్వంసం ఐనా రోడ్డు ను మరమ్మతులు చేయండి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామ శివారులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా రోడ్డు ధ్వంసం కావడం తో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. హైదరాబాద్ నుండి రోజుకు కు రెండు బస్సులు వయా రాంపురం నుండి మరిపెడ బంగ్లా కు చేరుకొని రాత్రి నైట్ హల్ట్ చేసి మర్నాడు హైదరాబాద్ బయలుదేరేది.
ఇప్పుడు రోడ్డు పూర్తిగా డ్యామేజీ కావడం తో.
కనీసం లారీ, బస్సు లు వచ్చె పరిస్థితి లేదు, ఒక్క ఆటో తప్ప వేరే
వాహనాలకు ఆ రోడ్డుపై వెళ్లే విస్తీర్ణం లేదు. కావున సంబంధిత
అధికారులు స్పందించి మళ్ళీ రోడ్డు పూర్తి స్థాయిలో మరమ్మతులు
చెయ్యాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరద సమయంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి వెంటనే మర్మమతులు చేస్తామని
హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చక పోవడం తో ‘ ఇబ్బందులు
పడుతున్నామని తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.