నమ్మిన మాదిగ ప్రజలను మోసం చేయడం బిజెపి నైజం

10 న ఇచ్చోడ లో మొదలైన మాదిగల సంగ్రామ పాదయాత్ర 7 వ రోజు జైనథ్ మండల కేంద్రం కు చేరుకుంది 16.06.2022

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ మంద కృష్ణమాదిగ నేతృత్వంలో 28 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి వచ్చినాక ఒకలాగా వ్యవహరించడం సిగ్గుచేటుగా భావిస్తున్నాము ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన మాట విస్మరించి మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తోంది ఇచ్చిన మాటకు నిలబెట్టుకోకపోతే రాబోవు రోజుల్లో బిజెపి పార్టీ మాదిగల ఆవేదనకు ఆగ్రహానికి పుట్టగతులు లేకుండా కొట్టుకుపోవడం ఖాయం ఇటువంటి న్యాయబద్ధమైన ఇటువంటి సామాజిక న్యాయాన్ని విస్మరిస్తున్న బిజెపి పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రావాలని పగటి కలలు కంటూ భ్రమలో ఉంటుంది వర్గీకరణ పైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నుంచి మొదలుకొని దేశ బిజెపి అధ్యక్షుడి వరకూ కింది స్థాయి మంత్రి నుండి కేబినెట్ స్థాయి మంత్రి వరకు మాదిగల సభ వేదికల పైకి వచ్చి హామీలిచ్చి ప్రగల్భాలు పలికి నేడు మాదిగ జాతి పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేసుకుని మాదిగ జాతి న్యాయబద్ధమైన ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టి మాదిగలకు న్యాయం చేయాలి జూలై 2, 3 తేదీలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో నిర్వహిస్తున్నారు ఆ సందర్భంలో మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలమేరకు 2 న సడక్ బంద్ పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధం నిర్వహిస్తాం 3న మాదిగల మహాగర్జన సభ హైదరాబాద్లో పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఈ సభకు అందరూ తరలి రావాలని పిలుపునిస్తున్నాము

యొక్క పాదయాత్ర బృందం సభ్యులు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరెల్లి మల్లేష్ మాదిగ , కో కన్వీనర్లు బరుకుంట సుభాష్ మాదిగ మాదిగ MSF జిల్లా కన్వీనర్ గొటిముక్లె సుభాష్ మాదిగ కో కన్వీనర్ పసుల శ్రీకాంత్ మాదిగ చంద్రశేఖర్ మాదిగ,జైనథ్ మండల ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుమల స్వామి మాదిగ,మెడిపట్ల స్వామి కోడిచెర్ల శివకుమార్,ప్రశాంత్ యోగేష్ సతీష్ నర్సింగ్ జైపాల్ వెంకటేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.