నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్న భారీ బహిరంగ సభ

జూలై 3న హైదరాబాద్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయుటకు,ధర్మసాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన,ధర్మసాగర్&వెలెర్ మండలాల పరిధిలోని శక్తి కేంద్ర ఇంఛార్జిల సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్,బిజెపి మహిళ మొర్చ రాష్ట్ర అధ్యక్షురాలు K.గీత మూర్తి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండె విజయరామారావు గార్లతో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ గారు

“క్షణం క్షణం మా కణం కణం….భరతమాతకే సమర్పణo” అని నినదించిన గౌరవనీయులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివాస్ సందర్భంగా ఈ రోజు ధర్మసాగర్ మండల కేంద్రంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ధర్మసాగర్,వేలేర్ మండలాల పార్టీ అధ్యక్షులు గంకిడి శ్రీనివాస్ రెడ్డి – కట్రేవుల రాజు,మరియు మండలాల పరిధిలోని రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,ముఖ్య నాయకులు,శక్తి కేంద్ర ఇంఛార్జిలు,వివిధ మొర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.