నర్సరీలో మొక్కల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలీ

హరితహారం కొరకు నర్సరీ లలో పెంచుతున్న మొక్కల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక మరిపెడ పురపాలక సంఘం హరిత హారం నర్సరీ నీ, అబ్బయిపాలెం గ్రామ పంచాయతీ హరితహారం నర్సరీ నీ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నర్సరీ పెంపకం నిరంతర ప్రక్రియగా భావించాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకొని మొక్కలు పెంచాలని తెలిపారు. లక్ష 25 వేల మొక్కలకు గానూ 85 వేల మొక్కలు పెంచుతున్నట్లు మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి కలెక్టర్ కు తెలుపగా, హరిత హారం కు మొక్కలు సిద్ధం చేయాలని, అవసరమైన పక్షంలో ఫారెస్ట్ నర్సరీ నుండి తెప్పించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నర్సరీ లో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీ కి సంబంధించిన బోర్డ్ ను రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసి దారి చుపెట్టే విధంగా బోర్డ్ ఏర్పాటు చేయాలని, హరిత హారంలో 10 వేల మొక్కల లక్ష్యంగా నర్సరీలో 17 వేల మొక్కలను పెంచుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ లు కలెక్టర్ కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 10 వేల మొక్కలలో గ్రామంలోని ఇళ్లకు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున 3300 మొక్కలు అందించాలని, మిగతా 6700 మొక్కలను బండ్ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనాలు, రోడ్డుకు ఇరువైపులా నాటే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూములు ఉండి మొక్కలు కాపాడే వారికి అందజేయాలని, ఇళ్లకు అవసరమైన మొక్కలను పెంచాలని, నర్సరీలలో పెంచుతున్న మొక్కలు కాకుండా కరివేపాకు వంటి విభిన్న రకాల మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వాచ్ మెన్ తో మాట్లాడుతూ, డబ్బులు సక్రమంగా అందుతున్నాయని అని అడిగి తెలుసుకున్నారు.ఫీట్ నుండి ఫీటున్నర సైజ్ మొక్కలను ఇళ్లకు అందించాలని, మీటర్, మీటరన్నర సైజ్ మొక్కలను బ్లాక్, అవెన్యూ ప్లాంటేషన్ కు ఉపయోగించాలని తెలిపారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన రెవిన్యూ ప్లాంటేషన్ లో పెరగని మొక్కల స్థానంలో రీప్లేస్ చేయాలని తెలిపారు. నర్సరీలో పెంచుతున్న.మొక్కల వివరాలతో కూడిన ఫ్లెక్సీ నీ ప్రదర్శించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అబ్బయిపలెం సర్పంచ్ జే. మని, పంచాయతీ కార్యదర్శి ఈ. నిరోష, మునిసిపల్ కమీషనర్ సత్యనారాయణ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ టి. సుధాకర్ మునిసిపల్ హెల్త్ అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్ వీరన్న, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.