నర్సులు నిజమైన సేవాముర్తులు

నర్సులు నిజమైన సేవ మూర్తులని ఉగ్గంపల్లిప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవి అన్నారు. గురువారం చిన్నగూడూరు మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ రవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్థానిక నర్స్ మాధవికి
శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నర్సులు నిజంగానే సేవాముర్తులు. చికిత్స చేయండి అని చేరిన నాటి నుంచి కోలుకొని తిరిగి వెళ్ళేవరకు వెన్నంటే ఉండి సేవలు చేస్తారు. అనుక్షణం నర్స్.. సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండ వస్తారు. ఇదిలా కోవిడ్ సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్‏తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు . తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండా.. కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందించారు కుటుంబాలకు దూరంగా ఉంటూరోగులే తమ పిల్లలుగా భావిస్తూ అహోరాత్రులు శ్రమిస్తున్న చల్లని దేవతలు అని కొనియాడారు. నిత్యం సేవ చేస్తూ ఉద్యోగంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కోంటూ వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి దూరంగా ఉంటూ కరోన కష్ట కాలంలో సేవలు అందించిన ప్రతి ఒక్క నర్సుకు మనస్పూర్తిగా ధన్యవాదలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వేజర్ రాధాకుమారి ఏఎన్ఎం నర్సు బాయ్ భారతి, శ్యామల, ఆశ వర్కర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.