నలుగురు క్రీడాకారిణిలు కాంస్య పతకం సాధించారు

పామిడి సమాచారం….ఈ నెల 20-22 వరకు గుంటూరులో జరిగిన 34వ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లేటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పామిడి గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ లో శిక్షణ పొందుతున్ననలుగురు క్రీడాకారిణిలు లావణ్య లాంగ్ జంప్,జాహ్నవి 60 మీటర్ల పరుగు,శైలు 600 మీటర్ల పరుగులో బంగారు పతకాలు మరియు వైష్ణవి 400 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించారు.పతకాలు సాధించిన వారు ఫిబ్రవరి నెలలో 6వ తేదీ నుంచి అస్సాం గౌహతి లో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారు ఈ సందర్భంగా వారికి మరియు అథ్లేటిక్స్ కోచ్ కార్తిక్ కి ,సలీమ్ కి సీనియర్ క్రీడాకారులు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమంలో అభయ ఆపద్భాందవ సంస్థ సభ్యుడు షామీర్, పీ. ఈ.టీ.లు హనుమేష్,పరమేష్,సీనియర్ క్రీడాకారులు రమణ, ఇంటియాజ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.