నల్లమల సినిమా ను ఆదరించాలి

నల్లమల సినిమా దర్శకుడు రవిచరణ్ ని అభినందించిన పరిపూర్ణానందస్వామి
ములుగు కేంద్రంలో విశ్వ హిందూ సేన, మహర్షి గోశాల నిర్వాహకులు సిరికొండ బలరాం వేద పండితుల సమక్షంలో మహా చండీ యాగం చేశారు.వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా చండీ యాగానికి విచ్చేసిన ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవారి యొక్క గొప్పతనాన్ని పుట్టుకతో వచ్చింది అమ్మ అని తాళి కడితే వచ్చింది ఆలీ అని అమ్మ గొప్పతనాన్ని విశ్లేషణాత్మకంగా వివరించారు.

బుధవారం మహర్షి గోశాల లో శ్రీ రుద్ర సహిత చండీ యాగానికి నల్లమల సినిమా దర్శకులు రవి చరణ్ హాజరయ్యారు వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ సమ్మక్క-సారక్కలు మన దేవతలని వారిని ఆదిపరాశక్తి గా పూజించు కోవడం ఆరాధించడం హిందువుల సనాతన ధర్మం అని వారన్నారు.
ఈ సందర్భంగా గోవుల పరిరక్షణ కోసం వాటిని సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు గాని ఇటీవల నల్లమల చిత్రం గోవుల గొప్పతనాన్ని చిత్రీకరించారని కొండలు కొనాలు వాటి ప్రాముఖ్యత ప్రకృతి అడవి తల్లి ఒడిలో జీవించే జీవరాసుల గురించి వాటిని కాపాడుకుని గౌరవించాలని నల్లమలలాంటి సినిమాలు రావాలని ఈ చిత్ర దర్శకులు రవి చరణ్ గొప్ప కథతో నల్లమల చిత్రం నిర్మించడం ఆనందం దాయకమని వారిని అభినందించారు.
నల్లమల చిత్ర దర్శకులు రవి చరణ్ ని శాలువాతో పూలమాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట నునావత్ మహేష్ నాయక్ పత్తి పల్లి ఎం పి టి సి,అజ్మీర వెంకట్రాం,రేలా విజయ్, రహీమ్ ఉద్దీన్ పెట్టం మల్లికార్జున్ తండా.సదానందం వెన్నెల శ్రీనాథ్ మైస ఎర్రన్న గద్ధర్ సాంబయ్య ఎండి యూనిస్ వై నాల శ్యామ్ తదితరులు ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.