కనగల్ మండల కేంద్రంలో మహసభల కరపత్రాలు ఆవిష్కరణ.

  నవంబర్ 17,18,19 తేదీల్లో జరిగే సిపిఎం జిల్లా 20 వ  మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.ఈరోజు కనగల్ మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈసందర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ 17 న నల్లగొండలో వేలాది మందితో ప్రజాప్రదర్శన గొప్ప బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు.భారత ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని సంస్కరణలను ప్రయివేటీకరణ విధానాలను వేగవంతం చేసిందని రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను విద్యుత్  చట్టాలను తీసుకొనివచ్చి ప్రజలపై భారాలు మోపిందని అన్నారు వీటితో పాటు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ఎల్ఐసి బ్యాంకింగ్ రైల్వే విమాన యానం రోడ్లు పోర్టులు నిట్టనిలువునా అమ్మేసిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో రుణమాఫీ దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుద్యోగ యువతకు ఉపాధి కేజీ టు పీజీ ఉచిత విద్య అమలుకు నోచుకోలేదని అన్నారు.  ఎన్నికలు రాగానే కొత్త పథకాలతో ఓట్లు వేయించుకొని అధికారంలో రావడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధికై ఇరవై వ మహాసభల్లో చర్చించి ఉద్యమాలు పోరాటాలు రూపొందిస్తామని తెలిపారు. మహాసభలను జయప్రదం  ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ దీర్ఘకాలిక సమస్యలతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధికై మహాసభల్లో చర్చించి ఉద్యమాలను పోరాటాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కందుల సైదులు సహాయ కార్యదర్శి కాన్పు లింగస్వామి నాయకులు ఎండీ అక్రమ్ బ్రహ్మానంద రెడ్డి నెలకొందా రాశి లింగయ్య మారయ్య శివలీల సుల్తానా రాంబాబు  లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.