నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జానా రెడ్డి గెలుపు కోసం నల్లగొండ జిల్లా అనుముల మండలం కొరివేని గూడెంలో జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప నేటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవు. నియోజకవర్గంలో గ్రామాల వారీగా తండాల వారిగా జానారెడ్డి చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు.
చిన్నచిన్న గ్రామాల్లో బడులు గ్రామ పంచాయతీలు డ్రైనేజీ కాలువలు సిసి రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జునసాగర్ లో చేసినటువంటి అభివృద్ధి పనులు మొత్తం జానా రెడ్డి గారి నేత్రుత్వంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనడంలో అతిశయోక్తి లేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే జననాయకుడు జానా రెడ్డి అన్నగారిని ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కోరారు.
