నాటు పడవలు నడిపితే కఠిన చర్యలు

అనుమతులు లేకుండా నాటు పడవలు నడపటం చట్టరీత్యా నేరమని డిఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్ పి రవీంద్ర బాబు ఆదేశాల మేరకు సీఐ సతీష్ చందర్లపాడు మండలంలో కృష్ణా నదిపై నాటు పడవలు నిర్వహించే నిర్వాహకులకు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కృష్ణా నదిపై నాటు పడవలు తిప్పటం చట్టరీత్యా నేరమని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రయాణికులను నాటు పడవల ద్వారా గుంటూరు జిల్లాకు రాకపోకలు చేయవద్దు అని ఏదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఇకపై అనుమతులు లేకుండా కృష్ణా నదిపై నాటు పడవల్లో నిర్వహించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రౌడీషీటర్లు కూడా నమోదు చేస్తామని డీఎస్పీ నాగేశ్వర రెడ్డి హెచ్చరించారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.