గుడిమెట్లటు తాడువాయి నాటు పడవకు ప్రత్యేకత ఏమిటి అటువైపు కన్నెత్తి చూడని అధికారులు అసలు చందర్లపాడు మండలం లో అధికారులు ఉన్నారా లేరా అన్నట్టుగా గుసగుసలాడుకుంటున్న గ్రామ ప్రజలు నేనే రాజు నేనే మంత్రి లాగా వ్యవహరిస్తున్న నాటు పడవ యాజమాన్యం
తెల్లవారుజామున చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం కృష్ణా నది నుండి గుంటూరు జిల్లా తాడువాయి గ్రామానికి అనధికారికంగా నాటు పడవలు రవాణా చేస్తున్నారు. మాదిపాడు 10 కిలోమీటర్లు ఉన్న తెలంగాణ గ్రామం నుండి మాదిపాడు పడవ ద్వారా మరి అక్కడి నుండి తాడువాయి పడవ ద్వారా తెలంగాణ మద్యం బాగా రవాణా జరుగుతుందని గుడిమెట్ల లో తెలంగాణ మద్యం ఏరులై పారుతుందని దీనివలన గుడిమెట్ల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు వెంటనే నాటు పడవ నిర్వాహకులను కట్టడి చేయకపోతే అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు వేడుకుంటున్నారు గతంలో ఇదే ప్రాంతంలో బల్లకట్టు మునిగి చాలా మంది ప్రాణాలు కృష్ణా నదిలో కలిశాయి. మరల లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో నే కనీసం లైఫ్ జాకెట్లు గజ ఈతగాళ్లు కూడా లేకుండా పడవ తిప్పటం అనుభవం లేని డబ్బులు కోసం కక్కుర్తి పడి ఇష్టానుసారంగా పడవలు తిప్పుతున్నారు ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్ , సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ లేదా జిల్లా ఎస్పీ ఎవరు వీటి పై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు బాధ పడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేసే దానికంటే ప్రమాదం జరగకుండా చూడాలని ప్రభుత్వ అనుమతులు లేకుండా తిరుగుతున్న పడవలను సీజ్ చేసి ఇ తగు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.