mahabubabad_collector_photos

వసతి గృహాల్లో పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొంటూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక -అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక జిల్లాలోని వసతి గృహాల్లో పిల్లలు
అస్వస్థతకు గురవడంపై, పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన
ఆహారం అందించుటకు, ఆరోగ్యం పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తల
విషయమై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చాలా హాస్టల్స్ ఉన్నాయని,
దాదాపు 120 వరకు ఉన్నాయని, ప్రతిసారి వీటి గురించి మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతున్న సంఘటనలు కొన్ని జరుగుతున్నాయని, గతంలో గూడూరులో, ప్రస్తుతం మహబూబాబాద్ లో ఇన్సిడెంట్ లు జరగడంపై ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించుకొంటున్నామని తెలిపారు. ప్రతి హాస్టల్ కు ప్రతిరోజు ఒక ఎ. ఎన్. ఎం. . ప్రతి మూడు రోజులకు ఒక డాక్టర్ సందర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎ. ఎస్. ఎం., డాక్టర్ ఫోన్ నంబర్ తెలిసే విధంగా హాస్టల్ లో డిస్ ప్లే చేయాలని, హాస్టల్ లో రాత్రిపూట వార్డెన్, సిబ్బంది అందుబాటులో ఉండాలని, మెనూ ప్రకారం భోజనం అందించాలని, త్రాగునీటి బ్యాంకులను క్లీనింగ్ చేసి అందించాలని తెలిపారు. పలు దఫాలుగా సమీక్షించుకొన్న పరిస్థితులు మారకుండా ఉండడంపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కనపడుతున్నదని, నిర్లక్ష్యం కనబరిచిన వారిపై చర్యలు తీసుకోవడం. జరుగుతుందని తెలిపారు.హాస్టల్ వారీగా స్పెషల్ ఆఫీసర్లను కేటాయించడం జరుగుతున్నదని, వారు తమకు కేటాయించిన హాస్టల్ లను తరచూగా తనిఖీ చేస్తూ హాస్టల్ లో ఉన్న సరుకులు నాణ్యమైనవి వాడే విధంగా, వంట వండే ప్రాంతం పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని, మెనూ ప్రకారం. భోజనం అందించేలా చూడాలని, అలాగే పిల్లలతో మాట్లాడి వారికి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. ఇవే తప్పులు రిపీట్ కాకుండా చూడాలని, హాస్టల్ కు అందించే మిషన్ భగీరథ నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని, వంటకు వాడే ట్యాంకుల వరకు మిషన్ భగీరథ్ నీరు అందించే విధంగా చూడాలని, ట్యాంకులు క్లిని చేస్తూండాలని, అధికారులు బాధ్యత గుర్తెరిగి పనిచేయాలని తెలిపారు. ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు హాస్టల్ లలో పాటించే విధంగా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు పిల్లలపై ఖర్చు చేస్తున్న సందర్భంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు తనిఖీ చేసిన రోజున పిల్లలతో కలిసి భోజనం చేయాలని తెలిపారు. కిటికీలు, తలుపులకు మెష్ లు ఉండే విధంగా చూడాలని తెలిపారు.హాస్టల్ లో ఉండకుండా రాత్రి పూట వెళ్లిపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయని, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తో మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో జరిగిన విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 953 మంది పిల్లలు ఉండగా కొంతమంది అస్వస్తతకు గురై ఐదుగురు రాత్రి ప్రధాన ఆసుపత్రికి వెళ్లి పరీక్షించుకొని రావడం జరిగిందని, ఉదయం నలుగురు ప్రధాన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని, పిల్లల అస్వస్థతకు కలుషిత ఆహారం కాకపోవచ్చని, వేరే పరిస్థితులు ఉండవచ్చు అవి డి. ఎం. అండ్ హెచ్. ఓ. చెప్పడం. జరిగిందని అడిషనల్ కలెక్టర్ ఎం. డేవిడ్ కలెక్టర్ కు వివరించారు.కలెక్టర్ మాట్లాడుతూ, ఆహారం వండే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, బియ్యాన్ని మంచిగా కడిగి పండాలని, తాజా కూరగాయలను వండాలని, కిచెన్, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లు క్లీన్ గా ఉంచాలని, కాచిన నీటిని త్రాగునీరుగా వాడాలని తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా ఉన్న పక్షంలో చర్యలు తప్పవని, వంట మనిషి, కామాటి, వార్డెన్ లతో తరచుగా సమావేశమై మాట్లాడాలని వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా హాస్టల్ వార్డెన్, సిబ్బంది, వెల్ఫేర్ అధికారులు బాధ్యత గుర్తెరిగి పనిచేయాలని ఆదేశించారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం. డేవిడ్, ఆర్డిఓలు, జిల్లా అధికారులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.