నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

వివిధ పార్టీల నుండి సుమారు 150 మంది హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ముందుగా వడ్డెర బస్తి లోని పోచమ్మ గుడి లో అమ్మవారి దర్శనం చేసుకున్న నాయిని రాజేందర్ రెడ్డి. అనంతరం బస్తి పెద్దమనుషులు నాయిని రాజేందర్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించారు.

63వ డివిజన్ పోచమ్మ గుడి ప్రాంత వాసులకు వడ్డెర బస్తి కాలనీలో ఉన్నటువంటి పేదలందరికీ ఏళ్ల తరబడి ఇండ్ల పట్టాలు లేక, ఇంటింటికి కరెంటు మీటర్లు లేక, కొందరికి ఇంటి నంబర్లు లేక, రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు సమస్య ఇక్కడ ఉన్నందున, తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు బాటలో ఉంటామనుకొని ఈ ప్రాంత వాసులు బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ వడ్డెర బస్తి కాలనీ ప్రజలందరూ ధైర్యంతో ఉండాలని, ప్రభుత్వం దృష్టికి ప్రజాస్వామ్య యుతంగా చట్టబద్ధతతో పరిష్కరించుకునే దిశలో మీ వెంట నేనుంటానని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం కానీ, వీధి గాని లేదని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని నేటికీ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కాజీపేట ప్రాంత వాసులకు గానీ, వరంగల్ నగరంలో గాని, జిల్లాలో గాని, ఎక్కడైనా చూసామని ప్రశ్నించారు. మాయమాటలను నమ్మి మాటల గారడీకి నమ్మి ఓట్లు వేశామని, రెండు పర్యాయాలు నేటి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే 8 ఏండ్ల పరిపాలనలో కాజీపేట కు ఒరిగిందేమీ లేదని, మీ కరెంటు మీటర్ల సమస్య, వీధి దీపాల సమస్య, రోడ్లు గాని, డ్రైనేజీ వ్యవస్థ గురించి వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా మీ వెంట ఉంటానని, ధరణి పేరుతో పేద ప్రజల భూములను గుంజుకునే విధంగా ఈ ప్రభుత్వం ఉన్నదని మీ బస్తీకి పట్టాలు వచ్చేంతవరకు పోరాడుతానని నాయిని రాజేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నేడు ఎన్నికలు లేవని, 8 ఏండ్ల నుండి ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవటానికి మీ దగ్గరికి వచ్చానని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యే గా ఉండి ఈ చిన్న బస్తికి పట్టాలిప్పించలేకపోయాడని, కరెంటు సమస్య, వీధి దీపాల సమస్య తీర్చలేకపోయాడని బాధను వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం బడుగు బలహీన వర్గాల, దళితుల, మైనార్టీల అభివృద్ధి కేవలం సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ దేనని, బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు పేద దళిత బడుగు బలహీన మైనార్టీ వర్గాల వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, నిరుద్యోగ సమస్యను నేటికీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం బాధాకరమని, వడ్డరి కాలనీలకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాదేస్తున్నదని తెలియజేశారు. రానున్న రోజుల్లో పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కంకణ బద్ధులై ప్రజా పోరాటాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా చేద్దామని కాజీపేట నగర పురవీధులలో గుంతలతో ఉన్నటువంటి రోడ్ల సమస్యను స్థానిక పట్టణ అభివృద్ధి కొరకు ఉద్యమాలు నిర్మాణం చేద్దామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అంకూస్, పాలడుగుల ఆంజనేయులు, ఫ్రాన్సిస్ రెడ్డి, బుర్ర బాబురావు, నాగపురి లలిత ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.

కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారు పళ్లెపు వెంకటయ్య, పళ్లెపు బాబు, పళ్లెపు రవి, పళ్లెపు సారయ్య, గుంజ కుమార్, గుంజ సమ్మయ్య, పళ్లెపు సమ్మయ్య, గుంజ చిన్న సమ్మయ్య, పళ్లెపు తిరుపతి, గుంజ వెంకటేష్, గుంజ రాజు, గుంజ కిట్టు, దండ్ల సమ్మయ్య, గుంజ శేఖర్, పళ్లెపు ప్రవీణ్, గుంజ రాకేష్, గుంజ భాస్కర్, పళ్లెపు సురేష్, పళ్లెపు నరేష్, గుంజ రాజేష్, గుంజ శంకర్ రావు, గుంజ రమేష్, గుంజ ఈశ్వర్, గుంజ కుమార్ సమ్మయ్య, పళ్లెపు లక్సమం, పళ్లెపు దుర్గారావు, పళ్లెపు సాయి, పళ్లెపు చిన్న సారంగపాణి, పళ్లెపు తిరుపతి, పల్లేపు సంబరావు మరియు మహిళలు అధికసంఖ్యలో చేరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, పల్లె రాహుల్ రెడ్డి, మహమ్మద్ అయూబ్, ఇప్ప శ్రీకాంత్, పోగుల సంతోష్, ఎస్కె అజ్గర్, నాగపురి రాంకీ గౌడ్, ప్రదీప్, క్రాంతి భరత్, కొండా శివ, పాషా, బక్కతట్ల మోహన్ టీంకు, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.