E69న్యూస్ రేగొండ:జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు రేగొండ గ్రామ పంచాయితీలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ రవి గార్లతో కలిసి పోలియో చుక్కలు వేసిన రేగొండ సర్పంచి ఏడునుతుల నిషిధర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వరకు తల్లిదండ్రులందరూ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తద్వారా పిల్లలు అంగవైకల్యం చెందకుండా ఉంటారని తల్లిదండ్రులు తమ బాధ్యతగా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించడం లో ముందుండాలని గ్రామంలోని చిన్న పిల్లల కు పల్స్ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆశ వర్కర్స్,అంగన్వాడి టీచర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.