నిరసన తెలిపిన వారి ఇళ్లను కూల్చడం చట్టవిరుద్ధం-ఆవాజ్

మత విద్వేష వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ ను అరెస్టు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిరసన తెలిపిన వారి ఇళ్లను చట్టవిరుద్ధంగా బుల్డడోజర్ల తో కూల్చివేయడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును అణచివేస్తూ, బుల్డోజర్ లతో
రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఈ దురాగతాలను ఖండించాలని పిలుపు నిలుస్తున్నది.

మొహమ్మద్ ప్రవక్త పై నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలను నిరసిస్తూ, వారిని అరెస్టు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దేశంలో అనేక చోట్ల అన్ని తరగతుల ప్రజలు ఖండిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రయాగ్ రాజ్ లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన జావెద్ అహ్మద్ తదితరులపై అల్లర్లకు పాల్పడ్డారని కేసులు బనాయించి, బుల్డోజర్ తీసుకెళ్లి ఆయన ఇంటిని అక్రమంగా కూల్చివేశారు. ఇది
చట్టానికి, న్యాయానికి వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం. ఎవరైనా నిజంగానే అల్లర్లకు పాల్పడితే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలి, కానీ ఈ రకంగా న్యాయస్థానాలను, చట్టాన్ని పక్కన పెట్టి విధ్వంసం చేయడం దుర్మార్గం. దీనిని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు గొడ్డలిపెట్టు లాంటివి. తమకు నచ్చని వారిపై తప్పుడు కేసులు బనాయించి, వారి ఇండ్లను బుల్డోజర్లతో కూల్చే సంస్కృతి దేశ అభివృద్ధికి
ప్రమాదం. సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి, బుల్డోజర్ రాజ్ ఆగడాలను ఆపాలని కోరుతున్నాము. ముుుస్లిం మైనారిటీల ఇండ్లను అక్రమంగా ధ్వంసం చేేసి, ఆ శిథిలాల కింద బిజెపి దేశ ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేదని, ప్రజలు ఎల్లకాలం వాస్తవాలను గ్రహించకుండా ఉండరనేది చరిత్ర నేర్పిన పాఠం, పాలకులు దాన్నని గ్రహించాలి. బిజెపి నిరంకుశ, మతోన్మాద పాలనను
అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాము

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.