నిరుద్యోగులను,పట్టభద్రులను నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

నిరుద్యోగులను,పట్టభద్రులను నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మరియు ఐటీ శాఖ మంత్రి కే.టీ.ఆర్ అంటూ ద్వజమెత్తిన తెలంగాణ టీచింగ్-నాన్ టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాటలను నిరుద్యోగ పట్టభద్రులు నమ్మకూడదని విజ్ఞప్తి చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ డా.సామల శశిధర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికలకు ముందు తండ్రి కొడుకులు ఇద్దరికీ ఎన్నికల హామీలు గుర్తుకువస్తాయి అని అందులో భాగంగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నిరుద్యోగ భృతి ప్రకటనను విడుదల చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2018 ఎన్నికల మానిఫెస్టోలో పదో తరగతి నుండి పిజి వరకు చదువుకున్న నిరుద్యోగులు అందరికీ 3016/- రూపాయలు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ విషయం గురించి మాట్లాడకపోవడం విడ్డూరం అన్నారు. ఇప్పుడు పట్టభద్రుల నిరుద్యోగుల ఓట్లు అవసరం కాబట్టి మళ్లీ నిరుద్యోగ భృతిని తెరమీదికి తీసుకు వచ్చారన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మూతపడడంతో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే సుమారు నాలుగు లక్షల మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రోడ్డుమీద పడ్డారని వారిని ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అంతేకాకుండా ఉపాధ్యాయుల ఆకలి కేకలు కాస్త ఆకలిచావులు గా మారినా కనీసం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన మండిపడ్డారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలని నిరుద్యోగ పట్టభద్ర అభ్యర్థులందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.