#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యములో హైదరాబాద్ గాంధీ భవన్ లో నిరుద్యోగ నిరసన దీక్షకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ ఆధ్వర్యములో యూత్ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ వెళ్ళడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
రాష్ట్రంలో 2లక్షల 50 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ చెప్పగా.. దానిని పక్కన పెట్టి మరీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా.. మళ్లీ కొత్త కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారు. దీని వల్ల 29 లక్షల మంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లపై ఎదురుచూపులే మిగలనున్నట్టు అర్దమవుతోంది. తాజాగా ఏర్పాటైన కమిటీ ఒకవేళ నివేదికను త్వరగా ఇచ్చినా.. కేసీఆర్ సర్కార్ మళ్లీ ఏదో సాకును ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువడినా.. మళ్లీ కోర్టు చిక్కుల్లో ఇరుక్కునేలా నోటిఫికేషన్లను తయారు చేయడం ఈ ప్రభుత్వానికి షరా మామూలే. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో అదే జరిగింది కాబట్టి, నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయడానికి కేసీఆర్ జిత్తులు వేస్తున్నారు. ఎన్నికల సమయం లో కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని
ఎన్ని జిత్తులు, ఎత్తులు వేసినా.. రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ యువత కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించడం ఖాయం’ అని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర,ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
తాడ్వాయి మండల అధ్యక్షుడు జలపు అనంత రెడ్డి,
సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్,ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి,సర్పంచ్ గండి కల్పన కుమార్,దేవ్ సింగ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,మండల అధ్యక్షుడు జా టోత్ గణేష్,కోడి సతీష్,యూత్ కాంగ్రెస్ నాయకులు కిషోర్,తారక్, రాహుల్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.