నిరుద్యోగ సమస్యపై నిరంతరం పోరాటం డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్

దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పై నిరంతరం పోరాటం నిర్వహిస్తున్నట్లు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తెలిపారు.
గురువారం డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రథమ మహాసభల సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుంచి పుష్పాంజలి ఫంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనంతరం పుష్పాంజలి ఫంక్షన్ హాల్ లో జరిగిన డివైఎఫ్ఐ మహాసభలకు అధ్యక్ష వర్గంగా మంద సు, నోముల కిషోర్ వ్యవహరించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ…. కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తూ ఉద్యోగాలు లేకుండా చేస్తుందని, నిరుద్యోగులను కించపరిచే విధంగా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారని, విమర్శించారు, బిజెపి ప్రభుత్వం చేతగాని తనం వల్లే యువతకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రము తక్కువ కాదన్నట్టుగా పోటీ పడుతూ ప్రజలపై భారాలు మోపుతోందని, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఉద్యోగ ప్రకటన చేస్తుందని, ఇంతకాలం నిరుద్యోగులు గుర్తురాని ప్రభుత్వానికి ఎన్నికలు వస్తున్న సందర్భంగా గుర్తు రావడమే ఆశ్చర్యం కలుగుతుంది అని విమర్శించారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత సంక్షేమాన్ని విస్మరించాయని. సమస్యల పై జరుగుతున్న పోరాటంలో కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు బోట్ల చక్రపాణి గొడుగు వెంకట్,మంద సంపత్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి, నాయకులు బొల్లారపు సంపత్, వల్లెపు లక్ష్మణ్ సంధ్యా, సుమలత ప్రసాద్, ప్రవళిక, సుమన్, హర్ష, కుమారస్వామి, శ్రీనివాస్ సుదర్శన్, సతీష్, వెంకటేశ్వర్లు రాజేందర్ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.